ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిలిటరీ దుస్తుల్లో ఉక్రెయిన్ అధినేత.. ప్రశంసల జల్లు

ABN, First Publish Date - 2022-02-25T22:52:41+05:30

రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న ఉక్రెయిన్ అధినేత వోలోడిమిర్ జెలెన్‌స్కీకి చెందిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్‌లోని మిలిటరీ బేస్ క్యాంపుల్లో తమ సైన్యంతో కలిసి చర్చలు చేస్తున్న ఫొటోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న ఉక్రెయిన్ అధినేత వోలోడిమిర్ జెలెన్‌స్కీకి చెందిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్‌లోని మిలిటరీ బేస్ క్యాంపుల్లో తమ సైన్యంతో కలిసి చర్చలు చేస్తున్న ఫొటోలు వివపరీతంగా షేర్ అవుతున్నాయి. జెలెన్‌స్కీ ఇలా మిలిటరీ దుస్తుల్లో కనిపించడంపై నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెలెన్‌స్కీ నిజమైన నాయకుడు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలు ఇప్పటివి కావని తెలుస్తోంది. రష్యా యుద్ధం చేయొచ్చన్న అనుమానాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోయిన ఏడాది ఏప్రిల్‌లో రష్యా సరిహద్దులో ఉన్న ఒక మిలిటరీ బేస్‌ క్యాంప్‌ను ఆయన సందర్శించారు. ఆ సమయంలో మిలిటరీ దుస్తుల్లో కనిపించారు జెలెన్‌స్కీ. తాజాగా రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని కాపాడుకోవడానికి జెలెన్‌స్కీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రష్యా సైన్యం రాజధాని కీవ్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యాన్ సైనికులను తిప్పి కొట్టేందుకు కీవ్‌లోని అన్ని ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులు సిద్ధంగా ఉన్నారని జెలెన్‌స్కీ ప్రకటించారు.

Updated Date - 2022-02-25T22:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising