Perambur: నీటమునిగి బాలికల మృతి
ABN, First Publish Date - 2022-10-17T18:12:05+05:30
నీటిగుంటలో మునిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు. దిండుగల్ జిల్లా వత్తలగుండు సమీపం కున్నుత్తుపట్టికి చెందిన రాజా కుమార్తె
చెన్నై/పెరంబూర్: నీటిగుంటలో మునిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు. దిండుగల్ జిల్లా వత్తలగుండు సమీపం కున్నుత్తుపట్టికి చెందిన రాజా కుమార్తె ముత్తు (8), రాజా తమ్ముడు చిన్నరాజా కుమార్తె కృతిక (8), చంద్రన్ కుమార్తె ధనలక్ష్మి (8) అదే ప్రాంతంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. శనివారం సాయంత్రం గ్రామ శివారులోని తోటకు వెళ్లిన ఆ ముగ్గురు, అక్కడి నీటిగుంటలో స్నానానికి దిగి హఠాత్తుగా లోతైన ప్రాంతానికి కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకొని బాలికల మృతదేహాలు వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-10-17T18:12:05+05:30 IST