ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SSC recruitment scam: ఈ నెల 18 వరకూ పార్థా-అర్పితాకు జ్యుడీషియల్ కస్టడీ

ABN, First Publish Date - 2022-08-05T23:39:05+05:30

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఎస్ఎస్‌సీ స్కామ్‌ (SSC recruitment scam)లో నిందితులైన మంత్రి పార్థా చటర్జీ (Partha Chatterjee), ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee)కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఎస్ఎస్‌సీ స్కామ్‌ (SSC recruitment scam)లో నిందితులైన మంత్రి పార్థా చటర్జీ (Partha Chatterjee), ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee)కి కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు ఈ నెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వాదనల సమయంలో అర్పిత ప్రాణానికి ముప్పుందని ఆమె తరపు లాయర్ వాదించారు. అర్పితకు ఇచ్చే నీరు, ఆహారాన్ని కూడా చెక్ చేసి ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఆమెను మిగతా నిందితులతో కలిపి కాకుండా ప్రత్యేక గదిలో ఉంచాలని కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తరపున వాదిస్తున్న లాయర్ కూడా దీనికి మద్దతు పలికారు. 






అర్పిత ఫ్లాట్లలో నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. అర్పిత ఫ్లాట్ల నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా నోట్ల కట్టలు, ఐదు కేజీలకు పైగా బంగారం నగలు బయటపడటంతో కలకలం రేగింది. పరువు తీసిన పార్థాను మంత్రి పదవి నుంచి తొలగించి డబ్బుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలు వాదించారు. అయితే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పార్థా-అర్పిత లీలలు రోజుకొకటి బయటకు వస్తుండటంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee)కి దిక్కుతోచడం లేదు. శాంతినికేతన్‌లో అర్పితా-పార్థా పేరిట ఫామ్‌హౌస్, అర్పిత జీవిత భీమా పథకాలకు నామినీగా పార్థా పేరుండటం సహా అనేక విషయాలు బయటపడుతున్నాయి.

Updated Date - 2022-08-05T23:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising