ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Monsoon Session: నాలుగు రోజులు ముందే పార్లమెంటు నిరవధిక వాయిదా

ABN, First Publish Date - 2022-08-09T01:17:37+05:30

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారంనాడు నిరవధికంగా వాయిదా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌కు నాలుగు రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటం విశేషం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తూనే, 16 రోజుల పాటు సభ సమావేశమయిందని, ఏడు చట్టాలను ఆమోదించామని చెప్పారు.


కాగా, ఈనెల 10న పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సైతం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సభా పనిదినాలతో పాటు, సభా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను రాజ్యసభ సెక్రటేరియట్ సర్క్యులేట్ చేస్తుందని తెలిపారు. సహజంగా ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ ఎన్నిసార్లు సమావేశమైంది, ఏయే నిర్ణయాలు తీసుకుందనే వివరాలను ప్రకటించడం జరుగుతుంటుంది. షెడ్యూల్ ప్రకారం జూలై 18న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి.

Updated Date - 2022-08-09T01:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising