ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pamban: 35వ వసంతంలోకి పాంబన్‌ వంతెన

ABN, First Publish Date - 2022-10-03T15:02:24+05:30

పాంబన్‌ వంతెన(Pamban Bridge) 35వ వసంతంలోకి అడుగిడింది. రామనాథపురం జిల్లా మండపం-రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రైల్వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 2: పాంబన్‌ వంతెన(Pamban Bridge) 35వ వసంతంలోకి అడుగిడింది. రామనాథపురం జిల్లా మండపం-రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రైల్వే వంతెన, దాని పక్కనే రోడ్డు వంతెన నిర్మాణపనులు 1973లో రూ.20 కోట్లతో ప్రారంభమయ్యాయి. 15 యేళ్లపాటు సాగిన  పనులు 1988లో ముగిసాయి. అదే యేడాది అక్టోబరు 2న పాంబన్‌ రోడ్డు వంతెనను అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) ప్రారంభించారు. 79 స్తంభాలతో నిర్మించిన ఈ వంతెన పై భాగంలో స్ర్పింగ్‌ బేరింగ్‌లు ఏర్పాటుచేశారు. ఆసియాలోనే సముద్రంలో లోతైన ప్రాంతాల్లో నిర్మించిన వంతెనల్లో పాంబన్‌  ఒకటిగా పేరొందింది. రామేశ్వరానికి వెళ్లే పర్యాటకులు తప్పకుండా రోడ్డు వంతెన మీదుగా ప్రయాణించి ప్రత్యేక అనుభూతి పొందుతుంటారు. ఈ నేపథ్యంలో, 34 వసంతాలు పూర్తిచేసుకున్న పాంబన్‌ వంతెన(Pamban Bridge) ఆదివారం 35 యేడులోకి అడుగిడింది. ఇటీవల పాంబన్‌ వంతెనను రూ.16 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. మరో ఎనిమిది నెలల్లో వంతెన మరమ్మతుపనులు పూర్తవుతాయని, ప్రత్యేక రంగులు, ఆకర్షణలతో పర్యాటకులను మరింతగా ఆకట్టుకోనుందని జాతీయ రహదారుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-10-03T15:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising