ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'కశ్మీర్ ఫైల్స్' వివాదంపై ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-03-20T23:47:03+05:30

'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై వివిధ రాజకీయ పార్టీల మధ్య చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై వివిధ రాజకీయ పార్టీల మధ్య చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఏదైతే జరిగిందో దానికి పాకిస్థాన్, తీవ్రవాదం కారణాలని అన్నారు. జమ్మూలో ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ అతిపెద్ద హిందూ అని, అతిపెద్ద సెక్యురలిస్టు అని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు.


జమ్మూకశ్మీర్‌లో ఏదైతో జరిగిందో దానికి పాకిస్థాన్, మిలిటెన్సీ కారణమని ఆజాద్ అన్నారు. ఆ ప్రభావం హిదువులందరిపైన, కశ్మీర్ పండిట్లు, కశ్మీర్ ముస్లింలు, డోగ్రాలపైన పడిందని అన్నారు. తమ కాంగ్రెస్‌ పార్టీతో సహా రాజకీయ పార్టీలన్నీ కులం, మతం, ఇతర అంశాలతో విభజించాలని చూసినా సమాజం కలిసికట్టుగా నిలబడాలన్నారు. ''రాజకీయ పార్టీలు కులం, మతం పేరుతో నిరంతరం విభజించే ప్రయత్నించవచ్చు. మా (కాంగ్రెస్) పార్టీతో సహా ఏ పార్టీని నేను మినహాయించడం లేదు. సమాజం మాత్రం ఏకతాటిపై నిలవాలి. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం జరగాలి'' అని ఆజాద్ అన్నారు.

Updated Date - 2022-03-20T23:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising