ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pak: పెట్రోల్‌పై రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని

ABN, First Publish Date - 2022-03-01T02:22:29+05:30

లీటర్ పెట్రోల్‌పై పది రూపాయలు తగ్గిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఈ తగ్గింపు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: లీటర్ పెట్రోల్‌పై పది రూపాయలు తగ్గిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఈ తగ్గింపు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. దీనితో పాటు ఆయన మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పాకిస్తాన్‌లో మరో నాలుగు నెలల పాటు పెట్రోల్ ధరలు పెంపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్ణయించిన సమయం వరకు ఇవే ధరలు కొనసాగుతాయని ఇమ్రాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర 159.86 రూపాయలు ఉంది. అంటే ఇది మన కరెన్సీలో 68 రూపాయలకు అటు ఇటుగా ఉంటుంది. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఇక నుంచి 149.86 రూపాయలకే (ఇండియన్ కరెన్సీలో 64 రూపాయలకి అటు ఇటుగా) పాకిస్తాన్‌లో పెట్రోల్ లభించనుంది.

Updated Date - 2022-03-01T02:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising