ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russia and Pakistan : పుతిన్‌ ఎదుట పాక్ ప్రధాని తిప్పలు

ABN, First Publish Date - 2022-09-16T14:59:03+05:30

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ (Vladimir Putin)తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్) : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ (Vladimir Putin)తో సమావేశం సందర్భంగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ఇయర్‌ఫోన్‌ పెట్టుకోవడానికి అవస్థలు పడ్డారు. దీనిని పుతిన్ చిరునవ్వులు చిందిస్తూ గమనించారు. ఎవరైనా సాయం చేస్తారా? అని షరీఫ్ అడగడంతో భద్రతా సిబ్బంది ఒకరు వచ్చి, ఆ ఇయర్‌ఫోన్‌ను షరీఫ్‌ చెవికి అమర్చారు. 


ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశం నేపథ్యంలో షరీఫ్, పుతిన్ గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రారంభమవడానికి ముందు షరీఫ్ తన ఇయర్‌ఫోన్స్‌తో ఇబ్బందిపడ్డారు. రెండు చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. ‘‘ఆ తర్వాత నాకు సాయపడటానికి ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగారు. వెంటనే భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికి వచ్చి, ఆయన చెవికి ఇయర్‌ఫోన్‌ను అమర్చారు. ఒకసారి అమర్చిన తర్వాత అది పడిపోయింది. మళ్ళీ ఆ సిబ్బంది వచ్చి, మరోసారి ఆయన చెవికి దానిని అమర్చారు. ఈ సన్నివేశాన్ని పుతిన్ చిరునవ్వుతో చూశారు. 


పుతిన్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌, రష్యా మధ్య మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నందువల్ల గ్యాస్ సరఫరాకు సరఫరా చేస్తామన్నారు. రష్యా, కజకిస్ఠాన్, ఉజ్బెకిస్థాన్‌లలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇక ఆఫ్ఘనిస్థాన్ సమస్యను పరిష్కరించుకోవలసి ఉందని తెలిపారు. 


షాంఘై సహకార సంఘం సమావేశాలు సెప్టెంబరు 15న ప్రారంభమయ్యాయి, శుక్రవారం ముగుస్తాయి.


Updated Date - 2022-09-16T14:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising