ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు diplomatic passport...కొత్త ప్రధాని షెహబాజ్ ఆదేశాలు

ABN, First Publish Date - 2022-04-13T12:58:21+05:30

పాకిస్థాన్ దేశ 23వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ తన అన్న అయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోసం సంచలన ఆదేశాలు జారీ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశ 23వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ తన అన్న అయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోసం సంచలన ఆదేశాలు జారీ చేశారు.ఈద్ తర్వాత పాకిస్థాన్‌కు తిరిగి వచ్చే తన అన్న, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్ జారీ చేయాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.పనామా పేపర్స్ కేసులో 72 ఏళ్ల పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకుడైన నవాజ్ షరీఫ్ ను సుప్రీంకోర్టు జులై 2017లో పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయనపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేక అవినీతి కేసులు పెట్టింది.తన చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు నవాజ్ కు నాలుగు వారాల అనుమతి మంజూరు చేయడంతో 2019లో నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లిపోయారు.


తాను పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని లాహోర్ హైకోర్టుకు నవాజ్ గతంలో హామీ ఇచ్చారు. కాని పాకిస్థాన్ దేశానికి నవాజ్ షరీఫ్ రాలేదు. ఎట్టకేలకు తన సోదరుడు షెహబాజ్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో నవాజ్ పాక్ వచ్చేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు.


Updated Date - 2022-04-13T12:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising