ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Republic Bharat: పరువు నష్టం కేసులో విజయం సాధించిన పాక్ వ్యాపారవేత్త

ABN, First Publish Date - 2022-07-05T22:09:41+05:30

రిపబ్లిక్ భారత్‌ టీవీపై వేసిన పరువు నష్టం దావా కేసులో పాకిస్థానీ ఎన్నారై అనీల్ ముస్సారత్ విజయం సాధించారు. ఈ కేసుపై వాదనలు విన్న లండన్ హై కోర్టు.. ముస్సారత్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆయనకైన లీగల్ ఖర్చులను చెల్లించడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రిపబ్లిక్ భారత్‌ టీవీపై వేసిన పరువు నష్టం దావా కేసులో పాకిస్థానీ ప్రవాసుడు అనీల్ ముస్సారత్ విజయం సాధించారు. ఈ కేసుపై వాదనలు విన్న లండన్ హై కోర్టు.. ముస్సారత్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆయనకైన లీగల్ ఖర్చులను చెల్లించడంతోపాటు.. మరికొంత మొత్తాన్ని చెల్లించాని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..



పాకిస్థాన్‌కు చెందిన అనీల్ ముస్సారత్ బ్రిటన్‌ కేంద్రంగా వ్యాపారం చేస్తూ.. అక్కడే స్థిరపడ్డారు. ఆయనను రిపబ్లిక్ టీవీ ఆయనను ఐఎఐ మద్దతుదారుగా పేర్కొంటూ కథనాలు వెలువరించింది. ISIకి తొత్తుగా పని చేస్తూ.. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించింది. ఇందుకు సంబంధించిన కథనాలు 22 జూలై 2020లో బ్రిటన్‌లో ప్రసారం అయ్యాయి. దీంతో రిపబ్లికన్ టీవీపై ఆగ్రమం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రిపబ్లిక్ టీవీ యూకే బ్రాడ్‌కాస్టర్ అయిన వరల్డ్‌వ్యూ మీడియా నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా లండన్‌ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రిపబ్లిక్ టీవీ తన కథనాల ద్వారా చేసిన ఆరోపణలను కొట్టేసింది. అనీల్ ముస్సారత్‌కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి అనడానికి కానీ.. అతడు భారత్‌లో ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. 


ఇదిలా ఉంటే.. అనీల్ ముస్సారత్. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సన్నహితుడు. ఇమ్రాన్ పార్టీ కోసం నిధులను కూడా సమకూర్చారు. షరీఫ్ ఫ్యామిలి, పాక్ పంజాబ్ గవర్నర్ మఖ్దూమ్ అహ్మద్ మహమూద్ కుటుంబంతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. 


Updated Date - 2022-07-05T22:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising