ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్రాన్ ఖాన్‌కు ఎన్నికల కమిషన్ షాక్

ABN, First Publish Date - 2022-04-05T23:20:17+05:30

మూడు నెలల్లో ఎన్నికలు జరగాలనుకున్న పాకిస్థాన్ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : మూడు నెలల్లో ఎన్నికలు జరగాలనుకున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల కమిషన్ జలక్ ఇచ్చింది. వివిధ కారణాలను చూపుతూ ఈ ఎన్నికలను నిర్వహించడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పింది. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, లాజిస్టికల్ సవాళ్ల వల్ల ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది.  


ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై పాకిస్థాన్ పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆదివారం తిరస్కరణకు గురైంది. వెంటనే పార్లమెంటును రద్దు చేయాలని, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి సిఫారసు చేశారు. కాసేపట్లోనే నేషనల్ అసెంబ్లీని రద్దు చేసినట్లు అల్వీ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరుగుతోంది. 


ఎన్నికల కమిషన్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ముఖ్యంగా కైబర్ పక్తూంక్వాలో నియోజకవర్గాలు పెరగబోతుండటం, జిల్లా, నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయడం ప్రధాన సవాళ్ళు. ఎన్నికల నిర్వహణకు కనీసం ఆరు నెలలు అవసరం. 


నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఒక నెల సమయం ఇవ్వాలని చట్టం చెప్తోంది. ఎలక్షన్ మెటీరియల్‌ను సేకరించడం, బ్యాలట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సిబ్బందికి శిక్షణనిచ్చి, నియమించడం వంటివాటికి కూడా సమయం అవసరమవుతుంది. వీటన్నిటికీ బిడ్‌లను ఆహ్వానించి, తనిఖీ చేసి, ఖరారు చేయడానికి కూడా సమయం పడుతుంది. 1 లక్ష పోలింగ్ స్టేషన్లకు ఈ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం, ఎన్నికల షెడ్యూలును నాలుగు నెలల ముందుగా ప్రకటించవలసి ఉంటుంది. 


బలూచిస్థాన్‌ లోకల్ గవర్నమెంట్ ఎన్నికలు మే 29న జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదేవిధంగా పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్ లోకల్ గవర్నమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. 


Updated Date - 2022-04-05T23:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising