ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్రాన్ దేశం వదిలి వెళ్లకుండా పిటిషన్

ABN, First Publish Date - 2022-04-10T20:52:27+05:30

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు మాజీ మంత్రులు కూడా దేశం వదిలి వెళ్లకుండా చూడాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు మాజీ మంత్రులు కూడా దేశం వదిలి వెళ్లకుండా చూడాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. శనివారం రాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవి కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని, దీంతో అరెస్టును తప్పించుకునేందుకు ఆయన దేశం వదిలి వెళ్లిపోతాడని ప్రచారం మొదలైంది. దీంతో ఇమ్రాన్ దేశం వదిలి వెళ్లకుండా చూడాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ప్రకారం.. ఇమ్రాన్ పేరును ‘ద ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్’లో చేర్చాలని పిటిషనర్లు కోరారు. పాక్ వదిలి వెళ్లకూడదనుకునే వ్యక్తుల పేర్లు ఈ లిస్టులో ఉంటాయి. ఈ జాబితాలో చేరిన వాళ్లు దేశం వదిలి వెళ్లడం సాధ్యపడదు. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించేందుకు అమెరికా కుట్ర చేసిందన్న ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. 

Updated Date - 2022-04-10T20:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising