ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రత కల్పించినా ఒవైసీనే నిరాకరించారు: అమిత్‌షా

ABN, First Publish Date - 2022-02-07T21:05:36+05:30

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కేంద్రం భద్రత కల్పించినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కేంద్రం భద్రత కల్పించినా ఆయనే నిరాకరించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభకు తెలిపారు. యూపీలోని మీరట్‌లో ఒవైసీ కారుపై దుండగులు ఇటీవల కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై అమిత్‌షా రాజ్యసభలో ఒక ప్రకటన చేస్తూ, ఘటన జరిగిన వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్నామని చెప్పారు. దీనికి ముందు కేంద్ర భద్రతా సంస్థల సమాచారం మేరకు ఒవైసీకి భద్రత కల్పించాలని కేంద్రం ఆదేశించినట్టు చెప్పారు. అయితే, అందుకు ఒవైసీ ఇష్టపడలేదని, ఢిల్లీ, తెలంగాణ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని చెప్పారు. దీంతో ఒవైసీ భద్రతను మరోసారి అంచనా వేసి ఒక బుల్లెట్ ఫ్రూవ్ కారు, జడ్ కేటగిరి సెక్యూరిటీ కేటాయించామని తెలిపారు. అప్పుడు కూడా ఒవైసీ నిరాకరించినట్టు సభకు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతకు ఒవైసీ సమ్మతించాలని విజ్ఞప్తి చేశారు.


ఒవైసీపై కాల్పుల ఘటన జరిగిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టామని, ఆ ఘటనతో ప్రమేయం ఉన్న ఇద్దర్ని అరెస్టు చేశామని, లైసెన్స్ లేని రెండు పిస్తోళ్లు, ఒక ఆల్టో కారు వారి నుండి స్వాధీనం చేసుకున్నామని అమిత్‌షా తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ సైతం సాక్ష్యాలను సేకరించిందని అన్నారు. హపూర్ జిల్లాలో పర్యటనకు సంబంధించి ఒవైసీ ప్రీషెడ్యూల్ కూడా లేదని, ఆయన పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా జిల్లా కంట్రోల్ రూమ్‌కు తెలియజేయలేదని పేర్కొన్నారు. కాల్పుల ఘటన అనంతరం ఒవైసీ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నట్టు అమిత్‌షా వివరించారు.

Updated Date - 2022-02-07T21:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising