ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladeshలో ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై అల్లరిమూక దాడి...ధ్వంసం

ABN, First Publish Date - 2022-03-18T16:37:09+05:30

బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. రాజధాని నగరమైన ఢాకాలోని ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై 200మందితో కూడిన అల్లరిమూక గురువారం దాడి చేసి, ఆలయాన్ని ధ్వంసం చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాకా : బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. రాజధాని నగరమైన ఢాకాలోని ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై 200మందితో కూడిన అల్లరిమూక గురువారం దాడి చేసి, ఆలయాన్ని ధ్వంసం చేసింది. ఆలయంపై దాడి చేసిన అల్లరిమూకకు హాజీ షఫీవుల్లా నాయకత్వం వహించాడని ఢాకా పోలీసులు చెప్పారు. ఆలయంపై జరిపిన దాడిలో సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహార్ హల్దార్, రాజీవ్ భద్ర సహా పలువురు గాయపడ్డారు.ఆలయంలోని వస్తువులను దుండగులు దోచుకున్నారని ఆలయ సిబ్బంది చెప్పారు. గత సంవత్సరం బంగ్లాదేశ్‌లోని కొమిల్లా పట్టణంలోని ననువార్ దిగి సరస్సు సమీపంలోని దుర్గా పూజ పండల్ వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారని సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించడంతో హింస చెలరేగింది.ఆ హింసాకాండలో ముగ్గురు మరణించారు.గతంలో ఢాకాలోని టిప్పు సుల్తాన్ రోడ్డు, చిట్టగాంగ్‌లోని కొత్వాలిలలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.


Updated Date - 2022-03-18T16:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising