ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbai ఆసుపత్రుల్లో 220 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా

ABN, First Publish Date - 2022-01-06T17:22:46+05:30

ముంబై నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 220 మంది రెసిడెంట్ వైద్యులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 220 మంది రెసిడెంట్ వైద్యులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కెఇఎమ్) ఆసుపత్రిలో 60 మంది రెసిడెంట్ వైద్యులు, లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రిలో 80 మంది, ఆర్ ఎన్ కూపర్ ఆసుపత్రిలో మరో ఏడుగురు కూడా కరోనా బారిన పడ్డారని డాక్టర్ల సంఘం ప్రతినిధి తెలిపారు.ఈ మూడు ఆసుపత్రులను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహిస్తోంది.పొరుగున ఉన్న థానే నగరంలో మున్సిపాలిటీ నిర్వహణలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో ఎనిమిది మంది రెసిడెంట్ వైద్యులకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.మహారాష్ట్రలో 26,538 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, ఇందులో ముంబైలో 15,166 మంది కరోనా రోగులున్నారు. ముంబైలో కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.


Updated Date - 2022-01-06T17:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising