ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan దేశంలో 22 లక్షల మంది హిందువులు...నేషనల్ డేటా‌బేస్ వెల్లడి

ABN, First Publish Date - 2022-06-10T17:30:35+05:30

పాకిస్థాన్‌ దేశంలో 22 లక్షల మంది హిందువులున్నారని జాతీయ డేటాబేస్ నివేదిక వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెషావర్: పాకిస్థాన్‌ దేశంలో 22 లక్షల మంది హిందువులున్నారని జాతీయ డేటాబేస్ నివేదిక వెల్లడించింది. దేశంలోని మొత్తం 18,68,90,601 జనాభాలో కేవలం 1.18 శాతం మాత్రమే హిందువులు ఉన్నారు.నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ సేకరించిన డేటా ఆధారంగా పాకిస్థాన్ దేశ మొత్తం జనాభాలో మైనారిటీలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నారని, అందులో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారని తేలింది.తాజా డేటా ప్రకారం దేశంలో మొత్తం నమోదిత వ్యక్తుల సంఖ్య 18,68,90,601 కాగా, వీరిలో 18,25,92,000 మంది ముస్లింలు.కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ పొందిన మైనారిటీల డేటాలో 1,400 మంది నాస్తికులు కూడా ఉన్నారు. 


పాక్ దేశంలో నమోదిత హిందువులు 22,10,566 మంది, క్రైస్తవులు 18,73,348మంది,  సిక్కులు 74,130మంది, భాయిలు 14,537,3,917 మంది పార్సీలున్నారని పాకిస్తాన్‌లో జరిగిన మూడు జాతీయ జనాభా గణన ఆధారంగా నివేదిక పేర్కొంది.బౌద్ధులు 1,787 మంది, చైనీస్ దేశీయులు 1,151మంది, షింటోయిజం అనుచరులు 628, యూదులు 628మంది, ఆఫ్రికన్ మతాల అనుచరులు 1,418 మంది, కెలాషా మతస్థులు 1,522మంది, జైనమతానికి చెందిన వారు  ఆరుగురు ఉన్నారు.హిందువుల్లో  95 శాతం మంది దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లో నివసిస్తున్నారు.

Updated Date - 2022-06-10T17:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising