ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhiలో 300 మంది పోలీసులకు కరోనా

ABN, First Publish Date - 2022-01-10T14:09:51+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో అదనపు పోలీసు కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్‌తో పాటు 150 మంది పోలీసులకు కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో అదనపు పోలీసు కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్‌తో పాటు 150 మంది పోలీసులకు కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పోలీసులు పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంటు అథారిటీ సోమవారం సమావేశం కానుంది. మొత్తం కర్ఫ్యూతో పాటు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏజెండాతో కరోనా పరిస్థితిపై చర్చించనున్నట్లు సమాచారం. ఆదివారం ఒక్కరోజే 22,751 మందికి కరోనా సోకింది. 


కరోనా పాజిటివిటీ శాతం 23.53శాతానికి పెరిగింది. ఢిల్లీలో కరోనాతో 17 మంది మరణించారు. వారాంతపు కర్ఫ్యూ సమయంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అంతర్ రాష్ట్ర బస్ టెర్మినస్‌ల నుంచి వచ్చే లేదా వెళ్లే ప్రయాణికులను తరలించడానికి అనుమతిస్తున్నారు.వారాంతపు కర్ఫ్యూ సమయంలో కిరాణా, వైద్య పరికరాలు, మందులు వంటి నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలను మాత్రమే తెరవడానికి అనుమతించారు.

Updated Date - 2022-01-10T14:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising