ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AIADMK angry over electricity charges: విద్యుత్‌ ఛార్జీలపై అన్నాడీఎంకే ఆగ్రహం

ABN, First Publish Date - 2022-07-26T16:43:23+05:30

విద్యుత్‌ ఛార్జీ(electricity charges)ల పెంపు నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                      - రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు


చెన్నై, జూలై 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఛార్జీ(electricity charges)ల పెంపు నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలో నిర్వహించారు. చెన్నై మినహా తక్కిన అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ యెత్తున పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోనూ నిరసనలు జరిగాయి. తాంబరం షణ్ముగం రహదారిలో చెంగల్పట్టువెస్ట్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆ జిల్లా కార్యదర్శి చిట్లపాక్కం రాజేంద్రన్‌ నాయకత్వం వహించారు. మాజీ మంత్రి(Ex Minister) టీకేఎం చిన్నయ్య, మాజీ శాసనసభ్యులు కనితా సంపత్‌, పార్టీ ప్రముఖులు ధనసింగ్‌, ఎన్‌సీ కృష్ణన్‌, శాంతకుమార్‌, న్యాయవాది సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇదే విధంగా మదురవాయల్‌లో జిల్లా నాయకుడు, మాజీ మంత్రి బెంజమిన్‌ నాయకత్వంలో, కడలూరు(Kadaluru)లో జిల్లా నాయకుడు ఎంసీ సంపత్‌, విల్లుపురంలో మాజీ మంత్రి సీవీ షణ్ముగం, పొల్లాచ్చిలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, తిరునల్వేలి రైల్వే జంక్షన్‌ వద్ద జిల్లా కార్యదర్శి గణేశ్‌రాజా నాయకత్వంలో ధర్నాలు జరిగాయి.  తూత్తుకుడిలో జిల్లా కార్యదర్శి షణ్ముగనాధన్‌, సేలం జిల్లా ఓమలూరులో జిల్లా కార్యదర్శి ఇలంగోవన్‌, నామక్కల్‌లో ఆ జిల్లా కార్యదర్శి సెల్లూరు కే రాజు, విరుదునగర్‌లో ఆ జిల్లా కార్యదర్శి మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌, దిండుగల్‌లో కార్యదర్శి దిండుగల్‌ శీనివాసన్‌, తిరుచ్చిలో ఆ జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి ఎం.పరంజోతి నాయకత్వంలో ధర్నాలు నిర్వహించారు. కోయంబత్తూరు, మదురై, తంజావూరు, తిరువారూరు, మైలాడుదురై తదితర జిల్లాల్లోనూ జరిగిన ఆందోళనలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-26T16:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising