ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ మళ్లీ ఓటింగ్‌కు దూరం

ABN, First Publish Date - 2022-03-05T07:04:42+05:30

రష్యా-ఉక్రెయిన్‌ అంశంలో భారత్‌ మరోసారి తటస్థ వైఖరినే ఎంచుకుంది. భద్రతామండలిలో, ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ఓటింగ్‌ కు గైర్హాజరైన భారత్‌ తాజాగా మరోసారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉక్రెయిన్‌లో ‘మానవహక్కుల ఉల్లంఘన’పై ఐరాస తీర్మానం

జెనీవా, మార్చి 4: రష్యా-ఉక్రెయిన్‌ అంశంలో భారత్‌ మరోసారి తటస్థ వైఖరినే ఎంచుకుంది. భద్రతామండలిలో, ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ఓటింగ్‌ కు గైర్హాజరైన భారత్‌ తాజాగా మరోసారి ఓటింగ్‌కు దూరంగా ఉంది. రష్యా సైనిక చర్య తర్వాత ఉక్రెయిన్‌లో మానవహక్కుల హననంతో పాటు సంబంధిత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఓ అంతర్జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్న అంశంపై శుక్రవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఓటింగ్‌ నిర్వహించింది. భారత్‌, చైనా, పాక్‌, సూడాన్‌, వెనిజులా సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూ రంగా ఉండగా.. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, జపాన్‌, యూఏఈ, నేపాల్‌ సహా 32 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. రష్యా, ఎరిత్రియాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మెజారిటీ దేశాలు తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించడంతో ముగ్గురు మానవహక్కుల నిపుణులతో ఓ అంతర్జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్‌ను యూఎన్‌హెచ్‌ఆర్సీ నియమించింది.   

Updated Date - 2022-03-05T07:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising