ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: అవయవదానానికి ఆదరణ

ABN, First Publish Date - 2022-08-20T14:08:20+05:30

రాష్ట్రంలో అవయవదానానికి ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోంది. ఏడు నెలలుగా నమోదైన గణాంకాలను విశ్లేషిస్తే ఈ దానంపై ప్రజల్లో అవగాహన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్రంలో పెరుగుతున్న అవగాహన  

- అయినా 2700 మంది అవయవాల కోసం ఎదురుచూపు


అడయార్‌(చెన్నై), ఆగస్టు 19: రాష్ట్రంలో అవయవదానానికి ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోంది. ఏడు నెలలుగా నమోదైన గణాంకాలను విశ్లేషిస్తే ఈ దానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు 18 మంది బ్రెయిన్‌ డెడ్‌ దాతలు ఉన్నారు. క్రితం ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉంది. ఇదే విషయంపై తమిళనాడు అవయవదానం మార్పిడి చికిత్స విభాగం ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది అవయవదానం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఆ ప్రకారంగా ఈ ఎనిమిది నెలల కాలంలో దాతల సంఖ్య 18కి పెరిగిందని తెలిపారు. వీరిలో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి(Rajiv Gandhi Government Hospital)లో ఐదుగురు అవయవదానం చేశారని గుర్తు చేశారు. అలాగే, స్టాన్లీ ఆస్పత్రిలో ఇద్దరు, మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు, కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు, మహాత్మా గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు, కోయంబత్తూరు, చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఒక్కొక్కరు చొప్పున అవయవదానం చేసినట్టు వెల్లడించారు. ఈ అవయవ మార్పిడి చికిత్సల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, అవయవదానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం(State Medical and Health Minister M. Subrahmanyam), రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల డీన్లతో సమీక్షలు నిర్వహిస్తూ, అవయవదానంపై అవగాహన కల్పించేలా చర్యలకు ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 11 కొత్త వైద్య కాలేజీలతో పాటు మొత్తం 36 ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉన్నాయి. అవయవ గ్రహీతల నుంచి విన్నపాలు స్వీకరించిన తర్వాతే క్రమపద్ధతిలో అవయవమార్పిడి చికిత్స చేస్తున్నారు. నిబంధనల మేరకు ఆపరేషన్‌ థియేటర్‌, అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌, కనిష్ఠంగా 25 పడకలు కలిగిన ఆస్పత్రులకు బ్రెయిన్‌ డెడ్‌ రోగుల నుంచి అవయవాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2700 మంది రోగులు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రి కిడ్నీ వ్యాధి నిపుణుల విభాగం ప్రొఫెసర్‌ ఒకరు మాట్లాడుతూ... గత వారం బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగి ఆచూకీని గుర్తించి, ఆ రోగి కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరించినట్టు తెలిపారు. కిడ్నీలు బాగా పాడైపోయి, డయాలసిస్‌ చికిత్స చేయించుకుంటూ కిడ్నీ దానం కోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య అధికంగా ఉందన్నారు. 

Updated Date - 2022-08-20T14:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising