ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OPS: పొంగల్‌కు రూ.3 వేలు

ABN, First Publish Date - 2022-12-16T09:46:31+05:30

పొంగల్‌ సందర్భంగా రేషన్‌ కార్డుదారులకు రూ.3 వేల నగదు అందించాలని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Pa

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఓపీఎస్‌ డిమాండ్‌

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 15: పొంగల్‌ సందర్భంగా రేషన్‌ కార్డుదారులకు రూ.3 వేల నగదు అందించాలని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ఆర్ధికంగా వెనుకబడిన వారు పండుగ జరుపుకొనేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ రేషన్‌ కార్డుదారులకు చీర, ధోవతి అందించారని, అనంతరం ఈ పథకాన్ని విస్తరించి సరుకులతో కూడిన గిఫ్ట్‌ ప్యాక్‌ పంపిణీ చేశారన్నారు. అనంతరం చీర, ధోవతి, గిఫ్ట్‌ ప్యాక్‌తో పాటు నగదు అందించే పథకాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అమలుచేశారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ఈ ఏడాది పొంగల్‌ సందర్భంగా నగదు ఇవ్వకపోగా, ప్రకటించిన 21 సరుకుల గిఫ్ట్‌ ప్యాక్‌లో 15 సరుకులే ఉన్నాయన్నారు. ఈ సరుకులు కూడా నాణ్యతగా లేవనే ఆరోపణలతో పంపిణీ సంస్థలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిందన్నారు. దీంతో, ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన రూ.1,200 కోట్లు వృధా అయ్యాయని తెలిపారు. 2023 పొంగల్‌ సందర్భంగా నాణ్యతతో కూడిన సరుకులతో పాటు రూ.3 వేల నగదు అందించేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే తరఫున డిమాండ్‌ చేస్తున్నట్లు ఓపీఎస్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-16T09:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising