ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hurting religious sentiments case: జర్నలిస్ట్ జుబెయిర్ అరెస్టు దారుణం : ప్రతిపక్షాలు

ABN, First Publish Date - 2022-06-28T20:32:13+05:30

Alt News సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబెయిర్‌ను అరెస్టు చేయడాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : Alt News సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబెయిర్‌ను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. మతపరమైన మనోభావాలను ఆయన గాయపరిచారని ఆరోపిస్తూ భారత శిక్షా స్మృతిలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, ఆయనను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనను ఒక రోజు కస్టడీకి అనుమతించింది.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌లో, బీజేపీ విద్వేషం, మతఛాందసత్వం, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తి వారికి ముప్పేనని తెలిపారు. సత్యం పలికే ఓ గళాన్ని అణచివేస్తే, వెయ్యి గళాలు అదనంగా ఉద్భవిస్తాయని హెచ్చరించారు. సత్యం ఎల్లప్పుడూ నియంతృత్వంపై గెలుస్తుందని భరోసా ఇచ్చారు. భయపడవద్దని అందరినీ కోరారు. 


ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన ట్వీట్‌లో, ముస్లింలకు వ్యతిరేకంగా నరమేధం జరగాలని ఇచ్చిన నినాదాలపై ఢిల్లీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరని, కేవలం విద్వేష ప్రసంగాలను రిపోర్టు చేయడం, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం నేరాలుగా పరిగణించి వేగంగా చర్యలు తీసుకుంటారని ఆరోపించారు. 


టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఇచ్చిన ట్వీట్‌లో, బీజేపీ బూటకపు వార్తలను ప్రతిరోజూ బయటపెడుతున్న ప్రపంచంలో అత్యుత్తమ జర్నలిస్టు జుబెయిర్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గొప్ప అధికారాన్ని అనుభవిస్తున్నప్పటికీ, వారు పిరికిపందలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Alt News సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా మాట్లాడుతూ, 2020నాటి కేసులో జుబెయిర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే హైకోర్టు ఆయన అరెస్టు కాకుండా గతంలో రక్షణ కల్పించిందన్నారు. దానిని పట్టించుకోకుండా ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఆయనను అరెస్టు చేశారన్నారు. 


ఇదిలావుండగా, ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీపీ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, తగిన సాక్ష్యాధారాలు ఉన్నందువల్లే జుబెయిర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. 


భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 153 (అల్లర్లు చెలరేగాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగినా, జరగకపోయినా), సెక్షన్ 295ఏ (ఏదైనా వర్గం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం) ప్రకారం Mohammed Zubairపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయనను సోమవారం అరెస్టు చేశారు. 


Updated Date - 2022-06-28T20:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising