ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Raghupati: త్వరలో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం

ABN, First Publish Date - 2022-09-15T14:49:45+05:30

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధించేలా త్వరలో చట్టం తీసుకురానున్నట్లు న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                - న్యాయశాఖ మంత్రి రఘుపతి


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 14: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధించేలా త్వరలో చట్టం తీసుకురానున్నట్లు న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati) తెలిపారు. సచివాలయంలో మంగళవారం రాత్రి మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధంపై ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించామన్నారు. మరో ముఖ్యమైన విషయం, దేశానికే ఈ చట్టం మార్గదర్శకంగాను, ఏ న్యాయస్థానం కూడా ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశం లేకుండా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ఈ దిశగా న్యాయనిపుణులతో సంప్రదించి ఈ చట్టాన్ని త్వరలో రూపొందించి, శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ‘నీట్‌’ మినహాయింపు కోరుతూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌(Governor) కేంద్రప్రభుత్వానికి పంపగా, తీర్మానంపై పలు సందేహాలు కేంద్రం లేవనెత్తిందన్నారు. వాటికి ఆరోగ్య, న్యాయశాఖలు సమాధానం ఇచ్చాయని తెలిపారు. విశ్వవిద్యాలయాలు వైస్‌ ఛాన్సలర్‌గా ఎవరిని నియమించాలన్న అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వాలనే చట్ట సవరణ గవర్నర్‌ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-09-15T14:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising