ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Secretary: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై సీఎస్‌ చర్చ

ABN, First Publish Date - 2022-07-31T12:41:00+05:30

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం అమలు చేసే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరైఅన్బు సంబంధిత అధికారులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం అమలు చేసే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరైఅన్బు సంబంధిత అధికారులతో చర్చించారు. సచివాలయంలో శనివారం ఉదయం సీఎస్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇటీవల ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధించే విషయమై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నివేదిక ప్రతిపాదనల మేరకు ఆన్‌లైన్‌రమ్మీని నిషేధించేలా ప్రత్యేక చట్టం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు అధికారులతో సమావేశమై ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టాన్ని అమలు చేయడానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సమగ్రంగా చర్చలు జరిపారు. సమావేశంలో హోంశాఖ(Ministry of Home Affairs) అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఫణీందర్‌రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు, ముఖ్యమంత్రి(Chief Minister) ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉదయచంద్రన్‌, సమాచార సాంకేతిక శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ జయంత్‌, న్యాయశాఖ కార్యదర్శి గోపి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-31T12:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising