ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌.. ఓ పొరపాటు..!

ABN, First Publish Date - 2022-01-07T08:13:50+05:30

ఒమైక్రాన్‌తో ప్రమాదం లేదు.. ఆస్పత్రిపాలయ్యేముప్పు తక్కువ అని ఊరట పొందుతున్నాం. కానీ.. ఇది వైరస్‌ పరిణామ క్రమంలో జరిగిన పొరపాటు మాత్రమేనని, వైరస్‌ కావాలని బలహీనపడడం కాదని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    • దీన్ని వాడుకుని గట్టెక్కాలి..
    • ప్రొఫెసర్‌ రవీంద్రగుప్తా

లండన్‌ : ఒమైక్రాన్‌తో ప్రమాదం లేదు.. ఆస్పత్రిపాలయ్యేముప్పు తక్కువ అని ఊరట పొందుతున్నాం. కానీ.. ఇది వైరస్‌ పరిణామ క్రమంలో జరిగిన పొరపాటు మాత్రమేనని, వైరస్‌ కావాలని బలహీనపడడం కాదని ‘కేంబ్రిడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ థెరపాటిక్‌ ఇమ్యూనాలజీ అండ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజెస్‌ (సీఐటీఐఐడీ)లోని క్లినికల్‌ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీంద్ర గుప్తా హెచ్చరించారు. ‘‘సాధారణంగా వైర్‌సలు కాలక్రమంలో ప్రమాదరహితంగా మారుతాయి. కానీ, కరోనా విషయంలో అలా జరగట్లేదు. బాగా వేగంగా వ్యాపిస్తోంది. మధ్యలో వచ్చిన ఒమైక్రాన్‌ను ఎవల్యూషనరీ మిస్టేక్‌ (పరిణామకమ్రంలో జరిగిన తప్పిదం)గా భావిస్తున్నా. వైరస్‌ కావాలని అలా ప్రమాదరహితంగా మారలేదు. ఏదేమైనా ఇది మంచివార్తేగానీ.. దీని తర్వాత వచ్చే వేరియంట్‌ ఇంత తక్కువ హానికరంగా ఉంటుందని భావించవద్దు. అది మునుపటి వేరియంట్ల తరహాలోనే ప్రమాదకరంగా ఉండొచ్చు. కాబట్టి, అసలు వైరస్‌ బారిన పడకుండా చూసుకోవడమే మంచిది. కానీ, ఒమైక్రాన్‌ను సహజ వ్యాక్సిన్‌గా భావిస్తున్నారు. అది ప్రమాదకరం. ఎందుకంటే ఒమైక్రాన్‌ వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి మనకు ఇంకా పూర్తిగా తెలియదు.’’ అని ఆయన వివరించారు.  మనకు దొరికిన ఈ సమయాన్ని వినియోగించుకుని వ్యాక్సినేషన్‌ను పెద్ద ఎత్తున చేసి ప్రజలందరికీ టీకాలు వేయాలని ఆయన సూచించారు.  

Updated Date - 2022-01-07T08:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising