ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో డోసుతో ఒమైక్రాన్‌కు చెక్‌

ABN, First Publish Date - 2022-01-21T07:58:12+05:30

బూస్టర్‌ (మూడో) డోసు వల్ల యాంటీబాడీల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగి.. ఒమైక్రాన్‌ నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని తాజాగా మరో అధ్యయనంలో వెల్లడైంది. యూకేలోని ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీకా ఏదైనా బూస్టర్‌తో రెండున్నర రెట్ల యాంటీ బాడీలు

యూకే పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

స్పుత్నిక్‌ 2 డోసులతో ఒమైక్రాన్‌పై ఫైజర్‌కన్నా అధికం

కరోనా వచ్చి 2 టీకాలు తీసుకుంటే ఎక్కువ రక్షణ: అధ్యయనం


లండన్‌, జనవరి 20: బూస్టర్‌ (మూడో) డోసు వల్ల యాంటీబాడీల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగి.. ఒమైక్రాన్‌ నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని తాజాగా మరో అధ్యయనంలో వెల్లడైంది. యూకేలోని ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐహెచ్‌ఆర్‌) పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. అందులో భాగంగా 364 మంది నుంచి సేకరించిన 620 రక్తనమూనాలను పరీక్షించారు. ఆస్ట్రాజెనెకా టీకా లేదా ఫైజర్‌ టీకాల్లో ఏదో ఒకదాన్ని రెండు డోసులు మాత్రమే తీసుకున్నవారి శరీరంలో ఉన్న యాంటీబాడీలు.. మూడో డోసు తీసుకున్నవారితో పోలిస్తే ఒమైక్రాన్‌ వేరియంట్‌ను నిరోధించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వారి పరిశోధనలో తే లింది. అంతేకాదు.. రెండో డోసు తీసుకు న్న తర్వాత మూడునెలల్లోనే యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతోందని, మూడో డోసు ఇవ్వడం వల్ల యాంటీబాడీ స్థాయులు పెరిగి ఒమైక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాయని వె ల్లడైంది. ఫైజర్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో యాంటీబాడీలు డెల్టా వేరియంట్‌ ను ఎంత సమర్థంగా ఎదుర్కోగలవో.. ఆ టీకా మూడో డోసుతో ఒమైక్రాన్‌నూ అంతే సమర్థంగా ఎదుర్కోగలవని తేలింది. ఇటీవలే అనుమతి పొందిన సింథటిక్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీ సోట్రోవిమాబ్‌ కూడా ఒమైక్రాన్‌ వేరియంట్‌ మన కణాల్లోకి చొరబడకుండా సమర్థంగా నిరోధిస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. మరోవె ౖపు.. రెండు డోసుల ఫైజర్‌ టీకాతో పోలిస్తే రెం డు డోసుల స్పుత్నిక్‌ టీకా వల్ల ఒమైక్రాన్‌ను నిరోధించే యాంటీబాడీలు రెండు రెట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని రష్యా, ఇటలీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కాగా.. రెం డు డోసుల టీకా మాత్రమే తీసుకున్నవారితో పోలిస్తే, ఒకసారి వైరస్‌ బారిన పడి, రెండు డోసులు కూడా తీసుకున్నవారికి కొవిడ్‌ నుంచి ఎక్కువ రక్షణ ఉంటుందని అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Updated Date - 2022-01-21T07:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising