ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో మరో 11 మందికి ఒమైక్రాన్‌

ABN, First Publish Date - 2022-01-04T18:04:22+05:30

రాష్ట్రంలో మరో 11 మందికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 77కు చేరింది. ఇదే విషయాన్ని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ సోమవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - 77కు చేరిన బాధితులు


బెంగళూరు: రాష్ట్రంలో మరో 11 మందికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 77కు చేరింది. ఇదే విషయాన్ని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ సోమవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. వీరిలో బెంగళూరుకు చెందినవారు 8 మంది కాగా ధారవాడ వాసులు ఇద్దరు ఉన్నారు. ధారవాడకు చెందిన 14 ఏళ్ల బాలికతో పాటు 53 ఏళ్ల మహిళకు ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకింది. వీరికి ఎటువంటి ట్రావెల్‌ హిస్టరీ లేకున్నా నిర్ధారణ కావడంపై డాక్టర్లు, ధారవాడ నగరపాలికె అధికారులు పర్యవేక్షణ సాగిస్తున్నారు. బెంగళూరులో ఒమైక్రాన్‌ సోకిన వారిలో 19 ఏళ్ల యువకుడితోపాటు బెల్జియం నుంచి వచ్చిన 40 ఏళ్ల మహిళ, దుబాయ్‌ నుంచి వచ్చిన 46 ఏళ్ల కెనడా వాసి, దుబాయ్‌ నుంచి వచ్చిన 49 ఏళ్ల ఇద్దరు మహిళలు ఉన్నారు. 67వ ఒమైక్రాన్‌ బాధితుడితో సంబంధాలు కలిగిన 13 ఏళ్ల బాలికతో పాటు ముంబై నుంచి వచ్చిన 42 ఏళ్ల మహిళ, 65 ఏళ్ల వృద్దురాలికి వేరియంట్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో 76 మంది ఒమైక్రాన్‌ వేరియంట్‌ బాధితులయ్యారు. కాగా బెంగళూరుకు చెందిన ఓ యువకుడికి ఒమైక్రాన్‌ నిర్ధారణ కాగా అతడు పరారీలో ఉండటంతో వైద్యఆరోగ్యశాఖ, పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. ఇతడితో కలిపితే రాష్ట్రంలో ఒమైక్రాన్‌ బాధితులు 77కు చేరుతారు.

Updated Date - 2022-01-04T18:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising