ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

45 నిమిషాల్లో ఒమైక్రాన్‌ను కనిపెట్టేస్తుంది !

ABN, First Publish Date - 2022-01-21T08:18:56+05:30

కరోనా పాజిటివ్‌గా తేలిన వారిలో చాలా మందికి తాము ఏ వేరియంట్‌ బారిన పడ్డామనేది తెలియదు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసిన తర్వాతే వారికి సోకింది ఒమైక్రానా, డెల్టానా లేదంటే మరేదైనా వేరియంటా అనేది తెలుస్తుంది. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మార్కెట్‌లోకి సరికొత్త కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్‌

  చెన్నైకి చెందిన క్రియా మెడికల్‌ టెక్నాలజీస్‌ ఆవిష్కరణ


న్యూఢిల్లీ, జనవరి 20 : కరోనా పాజిటివ్‌గా తేలిన వారిలో చాలా మందికి తాము ఏ వేరియంట్‌ బారిన పడ్డామనేది తెలియదు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసిన తర్వాతే వారికి సోకింది ఒమైక్రానా, డెల్టానా లేదంటే మరేదైనా వేరియంటా అనేది తెలుస్తుంది. ఈ ప్రక్రియకు గంటలు.. కొన్ని సందర్భాల్లో రోజులు కూడా పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. వేరియంట్‌ ఏంటో చెబుతూ 45 నిమిషాల్లోనే ఫలితం వెల్లడించే ఓ టెస్టింగ్‌ కిట్‌ను చెన్నైకి చెందిన క్రియా మెడికల్‌ టెక్నాలజీస్‌ సంస్థ రూపొందించింది. క్రివిదా నోవస్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ కిట్‌ అని దానికి పేరుపెట్టింది. ఇమ్యూజీనెక్స్‌ బయోసైన్స్‌ అనే సంస్థతో కలిసి ఈ కిట్‌ను తయారు చేశామని క్రియా వెల్లడించింది. తాము తయారుచేసిన టెస్టింగ్‌ కిట్‌ 45 నిమిషాల్లో ఫలితం ఇవ్వడంతోపాటు కరోనాలో(ఒమైక్రాన్‌/డెల్టా) ఏ వేరియంట్‌ బారిన పడ్డారో కూడా చెప్పేస్తుందని సం స్థ చెబుతోంది. తమ కిట్‌కు ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ఆమోదం కూడా లభించిందని గురువారం ప్రకటించింది. కాగా, చెన్నైలోని తమ ప్లాంట్‌లో వారానికి 50 లక్షల కిట్లను ఉత్పత్తి చేస్తున్నామని, డిమాండ్‌ మేరకు పెంచుతామని క్రియా మెడికల్‌ టెక్నాలజీస్‌ సీఈవో అను మోటురి వెల్లడించారు.

Updated Date - 2022-01-21T08:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising