ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు దశల్లో ఒడిశా పంచాయతీ ఎన్నికలు

ABN, First Publish Date - 2022-01-11T23:08:03+05:30

ఒడిశా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అదిత్య ప్రసాద్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అదిత్య ప్రసాద్ పథి మంగళవారంనాడు ప్రకటించారు. ఫిబ్రవరి 16న ప్రారంభమై ఐదు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 16,18,20,22,24 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫిబ్రవరి 26,27,28 తేదీల్లో బ్లాక్ సదర్ లెవెల్ వద్ద ఓట్ల కౌంటింగ్ జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పారు. పోలింగ్ ప్రక్రియలో కమిషన్ ఇంతకుముందే ప్రకటించిన కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదిత్య ప్రసాద్ తెలిపారు.


ఒడిశాలోని 853  జిల్లా పరిషత్ సీట్లు, 91,916 వార్డులు, 6,794 పంచాయతీలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్టీ సింబల్స్‌లో అభ్యర్థులు పోటీ చేయడానికి అనుమతిస్తారు. ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం, జనవరి 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 17 నుంచి 21 లోపుల అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవాలి. ఫిబ్రవరి 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. మార్చి 13న ఫలితాల పబ్లికేషన్ ఉంటుంది. మార్చి 23న వైస్ చైర్మన్ ఎన్నిక, డిక్లరేషన్, ఫలితాల ప్రకటన ఉంటుంది.

Updated Date - 2022-01-11T23:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising