ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధి జంతువుల రక్షణ కోసం Helpline Number

ABN, First Publish Date - 2022-06-08T12:49:17+05:30

వీధి జంతువుల రక్షణ కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: వీధి జంతువుల రక్షణ కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఒడిశా రాష్ట్రంలో జంతు అంబులెన్స్ ద్వారా పశువైద్య సేవలను విస్తరిస్తుందని అధికారులు చెప్పారు.ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర జంతు హెల్ప్‌లైన్ నంబరును ప్రారంభించారు. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే జంతువుల రక్షణ కోసం టెలీ వెటర్నరీ సేవలను సీఎం ప్రారంభించారు. వీధిజంతువుల భద్రతకు తన ప్రభుత్వం నిబద్ధత వ్యక్తం చేస్తుందన్నారు.టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ రాష్ట్రంలోని 11 పట్టణ ప్రాంతాల్లో జంతు అంబులెన్స్ ల ద్వారా పశువైద్య సేవలను విస్తరిస్తోన్నారు. హెల్ప్‌లైన్ 24 గంటలూ పని చేస్తోంది. ఇప్పుడు పౌరులు ఈ సేవ ద్వారా వీధి జంతువులకు సంబంధించిన అవసరమైన సహాయాన్ని పొందడానికి 1962 లేదా 155333కు కాల్ చేయవచ్చు.


మత్స్య, పశుసంవర్ధక కార్యక్రమాలు రాష్ట్ర రైతుల జీవనోపాధిని పెంచడానికి దోహదపడ్డాయని సీఎం అన్నారు.చేపల పెంపకం కోసం గోపాల్‌పూర్‌లో హేచరీని స్థాపించడానికి రాజీవ్ గాంధీ కేంద్రంతో అవగాహన ఒప్పందంతో పాటు 1,500 కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుల నియామకానికి ఇన్‌స్టిట్యూట్‌తో ఒడిశా సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఫిషరీస్, పశువుల మ్యాపింగ్ వ్యవస్థలను కూడా ప్రారంభించారు. 

Updated Date - 2022-06-08T12:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising