ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్‌ అమలుకు పరిశీలన: మంత్రి పొన్ముడి

ABN, First Publish Date - 2022-06-26T19:41:50+05:30

పెరంబూర్‌, జూన్‌ 25: అన్ని విశ్వవిద్యాలయాలు సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు పాటించాలని, రాష్ట్రప్రభుత్వం సూచించిన నిబంధనలు వర్సిటీలు సక్రమంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌, జూన్‌ 25: అన్ని విశ్వవిద్యాలయాలు సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు పాటించాలని, రాష్ట్రప్రభుత్వం సూచించిన నిబంధనలు వర్సిటీలు సక్రమంగా పాటిస్తున్నాయా లేదా అని పరిశీలించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి తెలిపారు. సేలం పెరియార్‌ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు నిబంధనలు తప్పకుండా అమలుచేయాలని ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసిందని, ముఖ్యంగా సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించామన్నారు. వర్సిటీల్లో అమలవుతున్న నిబంధనల పరిశీలనకు రాష్ట్రప్రభుత్వం నియమించిన వీరపాండ్యన్‌ వర్సిటీలకు వెళ్లి పరిశీలిస్తారని తెలిపారు. ‘నీట్‌’ కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని,  ప్రైవేటు నీట్‌ కోచింగ్‌ సెంటర్లకు లాభాలు అందించేలా ‘నీట్‌’ ఉందన్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే నిర్వాహకులు ఒకరు నీట్‌ కోచింగ్‌ సెంటర్‌ పేరుతో డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు. నీట్‌ రద్దు చేయాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-26T19:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising