ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid కట్టడికి చర్యలు చేపట్టండి: ఓపీఎస్‌

ABN, First Publish Date - 2022-06-11T14:51:44+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఓ ప్రకటన జారీ చేస్తూ ఇటీవలి కాలంలో చెన్నై, పరిసర జిల్లాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, కొత్త రూపు సంతరించుకున్న పీఏ 4, పీఏ5 వైర్‌సల వల్ల 12 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారని, ఇదంతా నాలుగో దశ వైరస్‌ వ్యాప్తి ఆరంభానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిరోధక నిబంధనలు పాటించడం మానుకున్నట్లు తెలిసినా డీఎంకే ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని పన్నీర్‌సెల్వం ఆరోపించారు. ఇకనైనా రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిరోధక నిబంధనలు కఠినంగా అమలు చేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-11T14:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising