ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NV Ramana: ఉచిత పథకాలపై ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-17T23:55:06+05:30

ఉచిత పథకాలపై సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలను నిజమైన సంక్షేమంతో ముడిపెట్టి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఉచిత పథకాలపై సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలను నిజమైన సంక్షేమంతో ముడిపెట్టి... గందరగోళానికి గురిచేయకూడదని హితవుపలికారు. ఉచిత పథకాలకు, సంక్షేమానికి మధ్య ఉన్న తేడా గమనించాలని సూచించారు. అసమానతలను తగ్గించడానికి రాష్ట్రాలు ప్రయత్నించాలని, సంక్షేమాన్ని అందించాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజకీయ పార్టీలు వాగ్ధానాలు చేయకుండా నిలువరించలేమని పేర్కొన్నారు. ఏది ఉచిత పథకం, ఏది సంక్షేమ వాగ్ధానం అని తేల్చడం ఎలా? అని ప్రశ్నించారు. ఉచిత విద్య, ఉచిత తాగునీరు వాగ్దానాలు 'ఉచితాలు' కావా? అని సీజేఐ ప్రశ్నించారు. ప్రొఫెషనల్ కోర్సులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామన్న హామీని... తాయిలంతో పోల్చలేమన్నారు. ఓటర్లు ఉచిత తాయిలాల కోసం చూస్తున్నారని అనుకోవడం లేదని చెప్పారు. నరేగా మంచి పథకం అయినా ఓట్లు రాల్చలేదని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకం గౌరవప్రదమైన సంపాదన అని తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ ఆస్తులను కూడా సృష్టించిందని తెలిపారు. వాగ్ధానాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని అనుకోవడం లేదని, ప్రజాధనాన్ని దుబారా చేయడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇప్పుడు మనకు కొన్ని కొత్త వాదనలు వచ్చాయని, పన్ను చెల్లింపుదారులు కష్టపడి సంపాదించిన డబ్బు... ఉచిత తాయిలాల కోసం వృధా అవుతుందని కొందరు అంటున్నారని తెలిపారు. మరికొందరు ప్రజాధనాన్ని సంక్షేమానికి ఖర్చు చేయడం అవసరమే అంటున్నారని గుర్తుచేశారు. ఈ ప్రశ్నలను పరిశీలించడానికి కోర్టుకు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. సమస్య మరింత క్లిష్టంగా మారుతోందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-17T23:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising