నూపుర్‌ను అరెస్టు చేయాలి
ABN, First Publish Date - 2022-06-19T08:44:15+05:30
ఇస్లాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను తక్షణం అరెస్టు చేసి శిక్షించాలని పలువురు ముస్లిం మత ప్రముఖులు డిమాండ్ చేశారు.
యునైటెడ్ యాక్షన్ ఫోరం తీర్మానం
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ఇస్లాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను తక్షణం అరెస్టు చేసి శిక్షించాలని పలువురు ముస్లిం మత ప్రముఖులు డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన యునైటెడ్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు తీర్మానించారు. ఇస్లాం మతం, మత ప్రవక్తను విమర్శిస్తూ ముస్లింల మనోభావాలను కించపరిచే విఽధంగా వ్యవహరించిన వారిద్దర్నీ తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.
Updated Date - 2022-06-19T08:44:15+05:30 IST