ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nupur Sharmaను చంపేందుకు సరిహద్దు దాటిన పాకిస్థానీ

ABN, First Publish Date - 2022-07-19T23:33:46+05:30

జైపూర్: నూపుర్ శర్మ (Nupur Sharma)ను చంపేందుకు రిజ్వాన్ అష్రఫ్ (Rizwan Ashraf) అనే ఓ పాక్ జాతీయుడు (Pakistani) అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: నూపుర్ శర్మ (Nupur Sharma)ను చంపేందుకు రిజ్వాన్ అష్రఫ్ (Rizwan Ashraf) అనే ఓ పాక్ జాతీయుడు (Pakistani) అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చాడు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా హిందూమల్‌కోట్ వద్ద సరిహద్దు దాటి అనుమానాస్పదంగా సంచరిస్తోన్న రిజ్వాన్‌ను ఈ నెల 16న సరిహద్దు గస్తీ దళం (Border Security Force) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరో (IB), రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW), మిలిటరీ ఏజెన్సీ అధికారులు సంయుక్తంగా ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. రిజ్వాన్ వద్ద ఉన్న సంచిలోనుంచి 11 అంగుళాల కత్తిని, మతపరమైన సాహిత్యాన్ని, మ్యాపులను, ఆహార పదార్ధాలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 


ఉత్తర పాకిస్థాన్‌లోని మండి బహవుద్దీన్ నగరానికి చెందిన రిజ్వాన్ నూపర్ శర్మను చంపేందుకు సరిహద్దు దాటినట్లు ఇంటరాగేషన్‌లో తెలిపాడు. అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లాక తన కుట్రను అమలు చేసేందుకు మార్గాలు వెతకాలనుకున్నట్లు వెల్లడించాడు. బీఎస్ఎఫ్ అధికారులు రిజ్వాన్‌ను రాజస్థాన్ పోలీసులకు అప్పగించారు. వారు రిజ్వాన్‌ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడిని 8 రోజుల పోలీస్ రిమాండ్‌కు అనుమతించింది. నూపుర్ శర్మకు చంపేందుకు రిజ్వాన్ భారత్‌లో ఎవరి సాయం తీసుకోవాలనుకున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. 



Updated Date - 2022-07-19T23:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising