ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ ఆర్మీ సీరియస్

ABN, First Publish Date - 2022-04-15T23:02:27+05:30

ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇందుకు కారణమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ ఆర్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. దొంగలు, దోపిడీదారుల చేతుల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా లేవా అన్నారు. కుట్రపూరితంగా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు దేశ అణ్వాయుధ కార్యక్రమాన్ని రక్షించగలరా అని ఆయన ప్రశ్నించారు. ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ ఆర్మీ సిరీయస్‌గా తీసుకుంది. పాక్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తిఖర్ స్పందిస్తూ... పాక్ అణ్వాయుధాలు వ్యక్తిగతానికి సంబంధించినవి కాదని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సబబుకాదని ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారని పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్(డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) ఒక ప్రకటన విడుదల చేసింది.


విదేశాల్లో డబ్బు దాచుకున్న వ్యక్తుల చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా అని పాక్దే వ్యవస్థలను ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. కుట్రపూరితంగా అధికారంలో వచ్చినవారని కొత్త ప్రధానిని తీవ్రంగా విమర్శించారు. ఈ దొంగల చేతికి పాకిస్తాన్‌ అప్పగించడం కాదా అని పాక్ సంస్థలను ప్రశ్నించారు. కనీసం దేవుడికైనా భయపడరా అని మండిపడ్డారు.  బుధవారం పెషావర్‌లో ఇమ్రాన్ ఖాన్ ఓ రోడ్‌షో నిర్వహించారు. తాను పదవీచ్యుతుడిని కావడం అమెరికా కుట్రగా అభివర్ణించారు. ఇందుకు అమెరికా క్షమాపణలు అక్కర్లేదన్నారు.

Updated Date - 2022-04-15T23:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising