ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agnipath ను వెనక్కి తీసుకోం: Ajit Doval

ABN, First Publish Date - 2022-06-21T21:03:12+05:30

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మిలట్రీ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ మద్దతు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మిలట్రీ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌ (Military recruitment policy)కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ (Ajit Doval) మద్దతు పలికారు. ఈ పథకం ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని అన్నారు. దేశాన్ని అత్యంత సురక్షితంగా, పటిష్టంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోదీ ప్రదర్శిస్తున్న రాజకీయ ధైర్యం ప్రశంసనీయమని కొనియాడారు. అగ్నిపథ్ (Aginpath) పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో డోవల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


అగ్నివీర్‌లను స్వలకాలిక వ్యవధిపై ఉద్యోగాల్లో తీసుకోవడంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అజిత్ డోవల్ తోసిపుచ్చారు. నాలుగేళ్లలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమశిక్షణ కారణంగా అగ్నివీరుల భవిష్యత్తు నాలుగేళ్ల తర్వాత కూడా సురక్షితంగా ఉంటుందన్నారు. ''మనకు యువకులు, శారీరకదారుఢ్యం ఉన్నవారు, చురుకైన సైన్యం అవసరం. యువ జనాభా ఉన్న దేశం మనది. ఆ యువశక్తి ప్రభావం మన సాయుధ బలగాల్లోనూ ప్రతిబింబించాలి'' అని ఆయన అన్నారు. అగ్నిపథ్ స్వతంత్రత (standalone) లేని స్కీమ్ కాదని చెప్పారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక సురక్షిత, పటిష్ట భారతదేశం అనేది ఆయన ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటయిందని చెప్పారు.


కోచింగ్ సెంటర్ల ప్రమేయంపై...

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చెలరేగిన హింసాకాండంలో కొన్ని కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించినప్పుడు, ఎఫ్ఐఆర్‌ఆర్‌లు నమోదయ్యాయని, నిందితులను గుర్తించడం జరిగిందని అన్నారు. తగిన దర్యాప్తు అనంతరమే ఈ హింస వెనుక ఎవరున్నారనేది చెప్పగలుగుతామని అజిత్ డోవల్ సమాధానమిచ్చారు.


Updated Date - 2022-06-21T21:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising