ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అణు పరీక్షలకు ఉత్తర కొరియా ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-03-08T20:53:59+05:30

ఉత్తర కొరియా త్వరలో అణు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అంచనావేస్తోంది. ఉత్తర కొరియాలో చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి లభించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు అమెరికాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర కొరియా త్వరలో అణు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అంచనావేస్తోంది. ఉత్తర కొరియాలో చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి లభించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు అమెరికాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) వెల్లడించింది. ఉత్తర కొరియా ప్రయత్నాలు ప్రపంచానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. డీఎన్ఐ అంచనా ప్రకారం.. ఉత్తర కొరియాలోని యోంగ్‌బియాన్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అణు పరీక్షలు జరిపేందుకే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని అమెరికా అంచనా. ఈ ప్రాంతంలో చివరిసారిగా 2017లో అణు పరీక్షలు జరిగాయి. తర్వాత 2018లో దీన్ని మూసివేశారు.


అప్పటినుంచి ఆ ప్రదేశంలో ఎలాంటి కదలికలు లేవు. అయితే, ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నట్లు అమెరికా గుర్తించింది. ఈ ప్రదేశంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షతోపాటు, అణు పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌తోపాటు, సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించగలిగే క్షిపణుల్ని ఉత్తర కొరియా అభివృద్ది చేస్తోంది. ఇది ఆ దేశపు అణు సామర్ధ్యాన్ని పెంచుతుంది. ప్రధానంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షలు జరుపుతోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ చేపడుతున్న ఈ చర్యలు అమెరికా అధ్యక్షుడు జో బైడైన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయని అమెరికా భావిస్తోంది. 

Updated Date - 2022-03-08T20:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising