ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాన్‌లో ఆగని హింస.. మరో యువతి కాల్చివేత

ABN, First Publish Date - 2022-09-29T09:06:58+05:30

హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేయడం కోసం ఇరాన్‌ ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

75కు చేరిన మృతుల సంఖ్య

టెహ్రాన్‌, సెప్టెంబరు 28: హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేయడం కోసం ఇరాన్‌ ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది. నిరసనకారులను ఇరాన్‌ సైన్యం కాల్చి చంపేస్తోంది. ఇప్పటివరకు 75 మందికి పైగా నిరసనకారులు చనిపోయారు. హదీస్‌ నజాఫీ (22) అనే యువతిని ఇరాన్‌ భద్రతా బలగాలు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశాయి. కారజ్‌ నగరంలో నిరసనల్లో పాల్గొన్న సమయంలో పోలీసులు ఆమెపైకి కాల్పులు జరిపారు. ఆమెకు 20కి పైగా బుల్లెట్‌ గాయాలు అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 16న మహసా అమీనీ మరణంతో ఇరాన్‌ అంతా నిరసనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో నిరసనలకు మద్దతుగా టర్కీ గాయని మెలెక్‌ మొస్సో స్టేజీపైనే తన జుట్టును కత్తిరించుకున్నారు. ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. 

Updated Date - 2022-09-29T09:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising