ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల్లోకి హిందూయేతరులను నిషేధించలేం

ABN, First Publish Date - 2022-07-05T07:54:42+05:30

ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశా న్ని నిషేధించలేమని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్రాస్‌ హైకోర్టు స్పష్టీకరణ

చెన్నై, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశా న్ని నిషేధించలేమని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసిం ది. ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు సంకుచిత దృష్టితో ఆలోచించలేవని, విశాల హృదయంతో ఆలోచించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్ర ముఖ నేపథ్యగాయకుడు జె.ఏసుదాస్‌ హిందూయేతరుడైనా ఆయన ఎన్నో హిందువుల భక్తిగీతాలు ఆలపించారని, వేలాంకన్ని చర్చి, నాగూర్‌ దర్గాకు అనేకమంది హిందువులు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారని గుర్తు చేసింది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో ప్రజలు దైవభక్తితో ఆలయాలకు వెళ్తే.. వారి మతాన్ని ధ్రువీకరించడంలో సమస్యలు నెలకొంటాయని వ్యాఖ్యానించింది. అయితే, కుంభాభిషేకాల్లో హిందూయేతరులు ప్రవేశించరాదనే నిబంధన హిందూ దేవాదాయశాఖ నిబంధనల్లో లేదని స్పష్టం చేసింది. అందువల్ల హిందూ ఆలయాల్లోకి, కుంభాభిషేకాలకు హిందూయేతరుల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిం.

Updated Date - 2022-07-05T07:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising