ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supertech Twin Towers : కూల్చివేత గడువు వారం రోజులు పొడిగింపు

ABN, First Publish Date - 2022-08-12T20:20:29+05:30

నొయిడాలోని 40 అంతస్తుల సూపర్‌టెక్ ట్విన్‌ టవర్స్ కూల్చివేత గడువును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నొయిడా: నొయిడాలోని 40 అంతస్తుల సూపర్‌టెక్ ట్విన్‌ టవర్స్ (Supertch Twin Towers) కూల్చివేత గడువును సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. జంట టవర్ల కూల్చివేత సన్నాహాలకు సంబంధించిన స్థాయీ నివేదికను నొయిడా అధికారులు అత్యున్నత న్యాయస్థానానికి గురువారం సమర్పించారు. ఈ నేపథ్యంలో కూల్చివేత గడువు తేదీని ఈనెల 21 నుంచి 28వ తేదీకి సుప్రీంకోర్టు పొడిగించింది.


నొయిడా సెక్టార్ 93ఏలోని ట్విన్ టవర్లు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం జరగడంతో వీటి కూల్చివేతకు గత ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశింది. 7.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ రెండింటినీ నిర్మించారు. గత మేలోనే వీటిని కూల్చాల్సింది. అయితే కారణాంతరాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈనెల 28న కూల్చివేసేందుకు నొయిడా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న భవంతుల్లో నివాసం ఉంటున్న వారికి ఇతర ప్రాంతాలకు తరలించారు. బిల్లింగ్‌లో 9,400 రంధ్రాలు చేసి సుమారు 3,500 కేజీల పేలుడు పదార్థాల్ని వాడబోతున్నారు. ముంబైకి చెందిన ఎడిఫిక్ ఇంజనీరింగ్ సంస్థ ఈ బాధ్యతలు తీసుకుంది. పేలుడు పదార్థాలు ఉపయోగించి బిల్డింగ్ కూల్చడం వల్ల చుట్టుపక్కల పడకుండా, నేరుగా కిందికి జంట టవర్లు కూలిపోతాయి. దీనివల్ల ఇతర బిల్డింగులకు ఎలాంటి నష్టం వాటిల్లదు.

Updated Date - 2022-08-12T20:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising