ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోయిడా పాఠశాలలో కొవిడ్ కలకలం

ABN, First Publish Date - 2022-04-12T17:06:28+05:30

నోయిడా నగరంలోని ఓ పాఠశాలలో 13 మంది విద్యార్థులకు, ముగ్గురు ఉపాధ్యాయులకు మంగళవారం కొవిడ్ సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

13 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లకు కొవిడ్...online classes ప్రారంభం

నోయిడా: నోయిడా నగరంలోని ఓ పాఠశాలలో 13 మంది విద్యార్థులకు, ముగ్గురు ఉపాధ్యాయులకు మంగళవారం కొవిడ్ సోకింది.పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు జరిపిన రాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మంగళవారం నుంచి ఈ నెల 18వతేదీ వరకు పాఠశాలలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.కరోనా సోకిన పాఠశాలలో పూర్తిగా శానిటైజ్ చేయించారు.ఇంతకు ముందు ఘజియాబాద్ నగరంలోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కూడా కరోనా సోకడంతో ఆ పాఠశాలను ముందుజాగ్రత్తగా మూసివేశారు.


కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిచెందకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలో కొవిడ్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కోరారు.సోమవారం దేశంలో 861 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్థుతం 11,058 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


Updated Date - 2022-04-12T17:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising