ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Noida: రూ.17 కోట్ల అక్రమ Farmhouse కూల్చివేత

ABN, First Publish Date - 2022-06-01T20:40:00+05:30

చట్టవిరుద్ధ నిర్మాణాలు, ఆక్రమణలపై నీటిపారుదల శాఖ, నొయిడా మున్సిపల్ శాఖ బుధవారంనాడు మరోసారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ నిర్మాణాలు, ఆక్రమణలపై నీటిపారుదల శాఖ, నొయిడా మున్సిపల్ శాఖ (Noida civic body) బుధవారంనాడు మరోసారి కొరడా ఝళిపించింది. సెక్టార్ 150లో అక్రమంగా నిర్మించిన ఫామ్‌హౌస్‌ (farmhouse)ను సంయుక్త ఆపరేషన్‌లో అధికారులు కూల్చివేశారు. 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌ను బుల్డోజర్‌తో కూల్చేశారు. ధ్వంసమైన ఈ ఆస్తి విలువ రూ.17.50 కోట్ల వరకూ ఉంటుంది. అక్రమంగా నిర్మించిన ఫౌమ్‌హౌస్‌ను ఉదయం 10 గంటల ప్రాంతంలో కూల్చివేసి, ఆక్రమణల నుంచి ఆ ప్రాంతానికి విముక్తి కలిగించినట్టు నొయిడా మున్సిపల్ అధికారులు మీడియాకు తెలిపారు. ముంపు ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణం జరిగినట్టు చెప్పారు.


కాగా, నొయిడా అధికారులు గత ఏప్రిల్‌ కూడా యమునా ఫ్లడ్‌ప్లెయిన్స్ (Floodplains) వెంబడి అక్రమంగా నిర్మించిన సుమారు డజను ఫామ్‌హౌస్‌లను కూల్చివేశారు. సెక్టార్ 134, సెక్టార్ 135లో 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన 10 నుంచి 12 ఫామ్‌హౌస్‌లు కూల్చివేసినట్టు మున్సిపల్ అధికారి ఒకకు చెప్పారు. కూల్చివేత కట్టడాల విలువ కోట్లలో ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయని తెలిపారు. 

Updated Date - 2022-06-01T20:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising