మతం మారినవారికి ఎస్సీ హోదా వద్దు
ABN, First Publish Date - 2022-10-17T08:52:08+05:30
ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా కట్టబెట్టాలనే యోచనను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వ్యతిరేకించింది.
వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్
న్యూఢిల్లీ, అక్టోబరు 16: ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా కట్టబెట్టాలనే యోచనను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వ్యతిరేకించింది. క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం కోసం గతవారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై వీహెచ్‌పీ స్పందించింది. ఎస్సీలు వారి కులాల ఆధారంగా చారిత్రకంగా నష్టపోయినవారని పునరుద్ఘాటించింది. తమ మధ్య కుల భేదం లేదని అబ్రహామిక్ మతాలు పేర్కొంటున్నందున వారికి ఎస్సీ హోదా కల్పించడం సరికాదని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు.
Updated Date - 2022-10-17T08:52:08+05:30 IST