ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోలు, క్యాష్ దొరకట్లేదు.. ప్రభుత్వంపై మాజీ క్రికెటర్ మండిపాటు

ABN, First Publish Date - 2022-05-25T23:25:21+05:30

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ అక్కడి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ లాహోర్‌లోని ఏ బంకులోనూ పెట్రోలు లభించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ అక్కడి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ లాహోర్‌లోని ఏ బంకులోనూ పెట్రోలు లభించడం లేదు. ఏటీఎం మెషిన్లలో నగదు దొరకడం లేదు. రాజకీయ నిర్ణయాల కారణంగా సామాన్యులు ఎందుకు బాధపడాలి??’’ అని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. ఈ మేరకు హఫీజ్ ట్వీట్ చేశాడు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్‌తోపాటు మరియం షరీఫ్, భుట్టో జర్దారీలను ట్యాగ్ చేశాడు. కాగా ఇమ్రాన్ ఖాన్ దిగిపోయిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 23న షాబాద్ షరీఫ్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయినా పాకిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో పాకిస్తానీయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 


కాగా మొహమ్మద్ హఫీజ్ పాకిస్తాన్ తరపున అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడాడు. 2017 ఐసీసీ చాంపియన్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 12 వేలకుపైగానే పరుగులు చేశాడు. అంతేకాకుండా 250కిపైగా వికెట్లు కూడా తీశాడు. పాకిస్తాన్ టీంకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. గతంలో క్రికెట్ వ్యవహారాల్లో ఆ దేశ క్రికెట్ బోర్డుపై పలుమార్లు ప్రత్యక్ష విమర్శలకు దిగిన హఫీజ్ ఈసారి ప్రభుత్వంపై విరుచుకుపడడం గమనార్హం.

Updated Date - 2022-05-25T23:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising