ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అణు యుద్ధం గెలవలేం : ఐదు దేశాలు

ABN, First Publish Date - 2022-01-04T21:00:46+05:30

అణ్వాయుధాల వ్యాప్తిని, అణు యుద్ధాన్ని నివారించాలని చైనా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : అణ్వాయుధాల వ్యాప్తిని, అణు యుద్ధాన్ని నివారించాలని చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ అంగీకారానికి వచ్చాయి. ఈ ఐదు దేశాల ఉమ్మడి ప్రకటనను రష్యా సోమవారం ప్రచురించింది. అణ్వాయుధ సామర్థ్యంగల దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం తమ ప్రధాన బాధ్యత అని ఈ దేశాలు పేర్కొన్నాయి. అణు యుద్ధంలో గెలుపు అనేది ఉండదని పేర్కొన్నాయి. ఈ దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలనే విషయం తెలిసిందే. 


సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని దేశాలతో కలిసి పని చేయడం తమ లక్ష్యమని చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ పేర్కొన్నట్లు ఈ ప్రకటన తెలిపింది. వ్యూహాత్మక నష్టాలను తగ్గించడం, అణ్వాయుధ సామర్థ్యంగల దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం తమ ప్రధాన బాధ్యత అని ఈ దేశాలు పేర్కొన్నట్లు తెలిపింది. అణు యుద్ధాన్ని గెలవలేమని, అణు యుద్ధం ఎప్పుడూ చేయకూడదని గట్టిగా చెప్తున్నట్లు పేర్కొంది. అణ్వాయుధాల వాడకం వల్ల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. అణ్వాయుధాలు ఉన్నంత వరకు వాటిని రక్షణ కోసం, దురాక్రమణను నిరోధించడానికి, యుద్ధాన్ని నివారించడానికి మాత్రమే వాడాలని అంగీకరించినట్లు పేర్కొంది. 


ఫ్రాన్స్ విడుదల చేసిన ప్రకటనలో, అణ్వాయుధాల నియంత్రణ, నిరాయుధీకరణ కోసం చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తమ దృఢ నిశ్చయాన్ని పునరుద్ఘాటించినట్లు తెలిపింది. 


ప్రస్తుతం అమెరికా-రష్యా, అమెరికా-చైనా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 


Updated Date - 2022-01-04T21:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising