ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పోస్టుల్లో Ipsలు వద్దు

ABN, First Publish Date - 2022-03-15T18:37:02+05:30

ఐపీఎస్‌ అధికారులను చట్టంతో సంబంధం లేని శాఖలలో పోస్టింగ్‌లకు కేటాయించడంపై కేంద్రహోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

             -  సీఎస్‌కు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశం


బెంగళూరు: ఐపీఎస్‌ అధికారులను చట్టంతో సంబంధం లేని శాఖలలో పోస్టింగ్‌లకు కేటాయించడంపై కేంద్రహోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరు గ్రామీణ జిల్లా నివాసి ఏ రమేష్‌ అనే వ్యక్తి ఇటీవల చట్టంతో సంబంధం లేని శాఖలలో పోస్టింగ్‌లకు ఐపీఎస్‌లను కేటాయిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖను సమగ్రంగా పరిశీలించిన మేరకే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ణాటక విద్యుత్‌ మండలి చైర్మన్‌, మైసూరు సేల్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, రవాణాశాఖ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మండలి, సమాచార శాఖలలో ఐపీఎస్‌ అధికారులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పోలీసు అధికారుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున చట్టంతో సంబంధం లేని శాఖలకు కేటాయిస్తుంటారు. పాలకుల స్వార్థంతో పాటు ఐపీఎ్‌సల సంసిద్ధత కూడా దీనికి కారణంగా ఉంది.

Updated Date - 2022-03-15T18:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising