ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttar Pradesh : స్కూల్ యూనిఫాం ధరించినవారికి పార్కుల్లో నో ఎంట్రీ

ABN, First Publish Date - 2022-07-29T21:51:26+05:30

స్కూలు యూనిఫాం ధరించిన విద్యార్థినీ, విద్యార్థులను ఉద్యానవనాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : స్కూలు యూనిఫాం ధరించిన విద్యార్థినీ, విద్యార్థులను ఉద్యానవనాలు (Parks), మాల్స్, రెస్టారెంట్లు, జంతు ప్రదర్శన శాలలు వంటి బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించరాదని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. పాఠశాలల పని వేళల్లో వీరిని ఈ ప్రదేశాలకు అనుమతించవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (State Commission for Protection of Child Rights) విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలల పని వేళల్లో విద్యార్థినీ, విద్యార్థులను బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించరాదు. విద్యార్థినీ, విద్యార్థులు తరచూ పాఠశాలకు డుమ్మా కొట్టి, పార్కులు, రెస్టారెంట్లు, జంతు ప్రదర్శనశాలలు వంటివాటికి వెళ్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను ఇచ్చింది. 


ఈ ఆదేశాలు ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులకు వర్తిస్తాయి. పాఠశాలలు, కళాశాలల పని వేళల్లో స్కూలు యూనిఫాం ధరించినవారు పార్కులు, మాల్స్, సినిమా హాళ్ళు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడంపై నిషేధం విధించాలని  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ సుచిత చౌదరి చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు తరగతులకు హాజరవడానికి బదులు ఇటువంటి ప్రదేశాల్లో గడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2022-07-29T21:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising