ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Currency Notesపై ఫోటోల మార్పు ప్రతిపాదన లేదు: RBI

ABN, First Publish Date - 2022-06-06T21:09:48+05:30

దేశంలోని కొత్త కరెన్సీ నోట్ల (Currency Notes)పై మహాత్మాగాంధీ (Mahatma Gandhi) ఫోటోల స్థానే పలువురు ప్రముఖులు ఫోటోలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని కొత్త కరెన్సీ నోట్ల (Currency Notes)పై మహాత్మాగాంధీ (Mahatma Gandhi) ఫోటోల స్థానే పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించాయి. అయితే ఈ వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తెలిపింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ, బ్యాంకునోట్లలో మార్పు ఉండదని వివరణ ఇచ్చింది.


దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోలను కూడా ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోందని,  కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని వార్తలు వచ్చాయి. ఫోటోల డిజైన్లను కేంద్రం ఆమోదించినట్టు ఆ వార్తలు పేర్కొన్నారు. గాంధీ కొత్త ఫొటోలతో పాటు ఠాగూర్‌, కలాం ఫొటోలను ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దిలీప్‌ షహానీకి పంపినట్టు ఆ కథనాలు పేర్కొన్నారు. కాగా, ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆర్‌బీఐ తాజాగా వివరణ ఇచ్చింది.

Updated Date - 2022-06-06T21:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising