ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిరాయింపులో సీఎం పదవిని మించిన ఆఫర్ ఏమీ లేదు : Supreme Court కి శివసేన చీఫ్ విప్ లేఖ

ABN, First Publish Date - 2022-07-11T03:24:51+05:30

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra political Crisis)పై సుప్రీంకోర్ట్‌లో సోమవారం(రేపు) అత్యంత కీలకమైన విచారణ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra political Crisis)పై సుప్రీంకోర్ట్‌లో  సోమవారం(రేపు) అత్యంత కీలకమైన వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శివసేన చీఫ్ విప్, డిఫ్యూటీ స్పీకర్ సునీల్ ప్రభు స్పందించారు. వివరణ ఇవ్వాలంటూ జూన్ 27న సుప్రీంకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఆదివానం ఓ లేఖ రాశారు. అనర్హత ప్రొసీడింగ్స్ ముగిసే వరకు రెబల్ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని లేఖలో కోరారు. ఫిరాయింపులో రెబల్ నేతకు సీఎం పదవిని ఆఫర్ చేయడానికి మించిన రివార్డేమీ లేదని పేర్కొన్నారు.


ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అనర్హతకు వీరంతా అర్హులేనని ఆయన పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారు. బీజేపీతో చేతులు కలిపారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అస్సోంలో కూర్చుని తీర్మానాలను పాస్ చేశారు. తద్వారా సొంత ప్రభుత్వాన్నే అస్థిరపరిచారని ఆయన పేర్కొన్నారు. కాగా సంక్షోభంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం నుంచి సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది. కాగా అనర్హత నోటీసులను సవాలు చేస్తూ ఏక్‌నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర డిఫ్యూటీ స్పీకర్‌ నర్హరి జిర్వాల్‌ స్పందించాలని జూన్ 27న సుప్రీంకోర్ట్ ఆదేశించింది. దీంతో తన స్పందనను లేఖ ద్వారా తెలియజేశారు.

Updated Date - 2022-07-11T03:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising